- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోన్ పే, గూగుల్ పేలో బీజేపీ డబ్బు పంచుతోంది : టీఆర్ఎస్
దిశ, తెలంగాణ బ్యూరో : ఈ మధ్య ఈటల రాజేందర్, బీజేపీ పార్టీ కొత్త కొత్త టెక్నాలజీని వాడుతున్నారని మాజీ mlc శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఎన్నికల కమిషన్‌కు టీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త టెక్నాలజీ ద్వారా ఓటర్లను ప్రలోభపెడుతున్నారని అన్నారు. చాలా మంది పేర్లతో బ్యాంక్‌లలో ఖాతాలు ఓపెన్ చేశారు. ఆ ఖాతాలతో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఎన్ని ఖాతాలు ఓపెన్ చేశారు అనే దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. సీనియర్ నాయకుడు గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ సోషల్ మీడియాను వాడుకోవడంలో PHD చేసిందనారు. బీజేపీ పార్టీపై మేము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని అన్నారు. గతంలో దుబ్బాకలో కూడా ఇదే విధంగా చేశారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారని మాకు సమాచారం వచ్చిందని సీఈఓకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. దుబ్బాక ఎన్నికల్లో కూడా బీజేపీ ఇలాంటి పని చేసింది. ఇక్కడ కూడా అదే పని చేస్తోందన్నారు. వందల కొద్దీ డూప్లికేట్ సిమ్ కార్డ్‌లు తెచ్చి వాటి ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై నిఘా పెట్టాలని సీఈఓను కొరినట్టు తెలిపారు. బ్యాంక్ ఖాతాలపై నిఘా పెట్టాలని కోరారు.
ఈటల రాజేందర్ అనేక అక్రమాలకు తెరలేపారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాత వైఖరితో ఉండాలని అన్నారు. ఎన్నికల కమిషన్ తీరు ఏకపక్షంగా ఉంది ఇది కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ ఒక్క పార్టీకి వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే అనే భయంతోనే బీజేపీ ఈ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.