- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జెండా పండుగరోజు టీఆర్‌ఎస్‌కు షాక్.. క్రీయాశీల కార్యకర్త రాజీనామా
దిశ ప్రతినిధి, మెదక్: అధికార టీఆర్ఎస్‌లో రాజీనామాల పర్వం ప్రారంభమయిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇస్తోన్న ప్రాధాన్యత ఉద్యమం నుంచి పార్టీ వెన్నంటే ఉన్న వారికి ఇవ్వడం లేదని చాలామంది సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినా.. పార్టీ అధిష్టానం దాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీనికి ఫలితమే ఉద్యమ కారుడి రాజీనామా. గురువారం సిద్దిపేట పట్టణానికి చెందిన టీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు, క్రీయాశీల కార్యకర్త గుండు రవితేజ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో రానున్న రోజుల్లో మరికొందరు సీనియర్ నాయకులు సైతం రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీఆర్ఎస్ క్రీయాశీల కార్యకర్త రవితేజ రాజీనామా..
దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా గ్రామగ్రామాన టీఆర్ఎస్ జెండాలు ఎగురవేయాలని పార్టీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో అందరూ జెండా ఎగురవేయుటకు రెడీ అవుతున్న తరుణంలో సిద్దిపేటకు చెందిన సీనియర్ నాయకుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం, కేటీఆర్‌కు లేఖ రాసిన నోట్ బయటకు రావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. సిద్దిపేట పట్టణానికి చెందిన గుండు రవితేజ ఉద్యమ సమయం నుండి పార్టీ అభివృద్ధికి కృషి చేశాడు. విద్యార్థి నాయకుడిగా తనదైన పాత్ర పోషించాడు. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం తనకు సరైన ప్రోత్సాహం, గౌరవం లభించలేదు. కనీసం నామినేటెడ్ పోస్టు సైతం దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన గురువారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లేఖ రాశారు. ఈ విషయమై ‘దిశ’ ప్రతినిధి ఆయన్ను సంప్రదించగా.. ‘‘పార్టీలో ముందు నుంచి ఉన్న వారికి, సీనియర్లకు సరైన గౌరవం లభించడం లేదు. నిన్న, మొన్న ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇచ్చిన ప్రాధాన్యత మాకు ఇవ్వడం లేదు. అందుకే పార్టీ క్రీయాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. రాజీనామా విషయంలో నాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. స్వచ్చందంగా రాజీనామా చేస్తున్నాను.’’ అని చెప్పారు.
అసంతృప్తిలో టీఆర్ఎస్ నాయకులు..
సిద్దిపేట జిల్లాలో ఉన్న టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చాలామంది ప్రస్తుతం అలకబూనారు. పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డా తమకు సరైన గౌరవం దక్కడం లేదని, వారు ఇతరులతో చెప్పుకొని బాధపడతున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవి కాకపోయిన ప్రోటోకాల్ కోసమైనా పార్టీలో ఏదైనా పదవి ఇస్తే బాగుండే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి, ఇప్పటి వరకు గ్రామ, మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయలేదు. తాజాగా.. ఈ నెలలో పార్టీ అనుబంధ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పడంతో చాలామంది ఆశావాహులు పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ పార్టీలో సరైన పదవి దక్కకపోయినా, సరైన గుర్తింపు లభించకపోయినా, అనేకమంది పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో హుజురాబాద్ టీఆర్ఎస్‌లో చేరికలు జరుగుతుండగా.. మంత్రి సొంత నియోజకవర్గంలో రాజీనామాల పర్వం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీనిపై ప్రతిపక్ష నాయకులు తమదైన శైలిలో కామెంట్లు చూస్తున్నారు. పక్క నియోజకవర్గంపై ఉన్న శ్రద్ధ సొంత నియోజకవర్గంపై లేదని, ముందు నీ నియోజకవర్గానికి సమయం కేటాయించు అంటూ హరీష్ రావుపై సెటైర్లు వేస్తున్నారు.