- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తారాస్థాయికి వర్గపోరు.. రాళ్లు రువ్వుకున్న టీఆర్ఎస్ నేతలు
దిశ, పాలేరు: టీఆర్ఎస్ నేతల్లో వర్గపోరు ఒక్కసారిగా భగ్గుమంది. క్రమశిక్షణకు మారుపేరైన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి వర్గీయుల మధ్య గ్రూపు తగాదాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కందాళ క్యాంపు కార్యాలయంలో గురువారం గ్రామ కమిటీలను ప్రకటించారు. ఈ కమిటీల ప్రకటన అనంతరం, అసంతృప్తి వ్యక్తం చేసిన ఓ వర్గం నూతన కమిటీలపై విమర్శలు చేశారు. దీంతో టీఆర్ఎస్‌లో రెండు గ్రూపులుగా చీలిపోయినట్లు స్పష్టంగా తేలిపోయింది. అయితే.. ఆ సమావేశంలో భాగంగా జరిగిన చిన్న చిన్న గొడవలను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో రెండు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శుక్రవారం కూసుమంచి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల సమావేశం ఉండటంతో ఇరు వర్గాల నేతలు, కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో కూసుమంచి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు మాటల దాడి అనంతరం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో నియోజకవర్గంలోని అధికార పార్టీ తీరుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.