- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళితులపై ఇంకెన్నాళ్లీ ఆధిపత్యం.. ఇక ఊరుకునేది లేదు
దిశ, గండీడ్: గండీడ్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణయ్యకు బహుజన నాయకులు భారీగా మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు ఆదివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్థానిక రిపోర్టర్ వార్త రాస్తే స్థానిక టీఆర్ఎస్ ఎంపీపీ మాధవి రెడ్డి భర్త రాజ్ కుమార్ రెడ్డి రిపోర్టర్‌ను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. దీనిపై శనివారం నంచర్ల గేట్ వద్ద విలేకరుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో పాటు అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణయ్య కూడా మద్దతు తెలిపారు.
దీనికి అదేరోజు మండల టీఆర్ఎస్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ మాధవి రాజ్ కుమార్ రెడ్డి, గదిర్యాల్ సర్పంచ్ వెంకట్ రామ్ రెడ్డిలు హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి కావాలని బోరు కృష్ణయ్యపై అనవసరమైన ఆరోపణలు చేశారని స్పష్టం చేశారు. తక్షణమే బోరు కృష్ణయ్యపై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ వృత్తిదారుల సంఘం మండల అధ్యక్షుడు ఆశన్న, ప్రధాన కార్యదర్శి రాజు, అంబేద్కర్ సంఘం నాయకులు మల్కాయ్య, వెంకటయ్య, నాగరాజు, లక్ష్మయ్య, రవి కుమార్, హన్మయ్య, BSP నాయకులు కృష్ణంరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.