- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముక్కు ముద్రలతో పశు గణన
దిశ ప్రతినిధి, మేడ్చల్: డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ముక్కు ముద్రల ద్వారా పశు సంపదను లెక్కించవచ్చని టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌ను కలిశారు. జియోస్టాట్ సంస్థ చైర్మన్ వివేక్ రెడ్డి ఆధ్వర్యంలో పశువులను లెక్కించే డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలను వివరించారు. మనుషుల వెలిముద్రలు ఏవిధంగా అయితే ఒకదానికొకటి పోలిక ఉండదో అదేవిధంగా జంతువులకు వాటి ముక్కు ముద్రలు పోలికలు ఉండవన్నారు. జంతువులకు డిజిటల్ పద్దతి ద్వారా ముక్కు ముద్రలు సేకరణతో సంప్రదాయ పద్దతి ఈయిర్ ట్యాగింగ్‌కు స్వస్తి చెప్పవచ్చన్నారు.
ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు జంతు బీమా కొరకు ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి మంచి ఫలితాలు సాధించి సఫలీకృతం అయ్యాయని రాజశేఖర్ రెడ్డి వివరించారు. మన రాష్ట్రంలో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించి పశుసంపద అభివృద్ధి కొరకు కృషి చేయాలని కోరారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని వినోద్ కుమార్ హామీ ఇచ్చారని అన్నారు.