- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెన్నార్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవీ ఘన విజయం..
దిశ, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు డివిజన్ బండలగూడ పరిధిలోని పెన్నార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమలో శుక్రవారం నిర్వహించిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవీ ఘన విజయం సాధించింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మద్దత్తుతో గంట గుర్తుపై టీఆర్ఎస్ కేవీ తరపున పోటీ చేసిన ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తన సమీప ప్రత్యర్థి సీఐటీయూ అభ్యర్థి చుక్కా రాములుపై 148 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. పరిశ్రమలో మొత్తం 584 ఓట్లు ఉండగా, ఎన్నికల్లో 580 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ కేవీ అభ్యర్థి రాంబాబు యాదవ్ కి 332 ఓట్లు, సీఐటీయూ అభ్యర్థి చుక్కా రాములుకు 184, ఐఎన్టీయూసీ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ కి 63 ఓట్లు వచ్చాయి.
రాంబాబు యాదవ్ విజయం సాధించడంతో పరిశ్రమ ఎదుట కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాంబాబు యాదవ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పరిశ్రమ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. మాజీ ఎంపీపీ, కార్మిక నాయకులు నాలకంటి యాదగిరి యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ పరిశ్రమ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 148 ఓట్ల మెజార్టీతో కార్మికులు గెలిపించారని పేర్కొన్నారు.