శోభన్ బాబు సిల్వర్ క్రేన్- 2025 అవార్డు ప్రముఖ సినీ నటుడికి ప్రదానం

by Kalyani |
శోభన్ బాబు సిల్వర్ క్రేన్- 2025 అవార్డు ప్రముఖ సినీ నటుడికి ప్రదానం
X

దిశ, రవీంద్రభారతి : శోభన్ సేవా సమితి, సిల్వెల్ కార్పొరేషన్, శృతిలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 18న రవీంద్రభారతిలో అందాల నటుడు శోభన్ బాబు 89 వ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని రాజువయ్య మహారాజువయ్య శోభన్ బాబు సిల్వర్ క్రేన్- 2025 అవార్డు ప్రముఖ సినీ నటుడు డా. నరేష్ కు ప్రదానం చేయనున్నట్లు శృతిలయ ఫౌండేషన్ కార్యదర్శి ఆమని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీల్వెల్ సినీ సుస్వరాలు -69, నవరస గాయని ఆమని ఆధ్వర్యంలో ప్రముఖ సినీ గాయని గాయకులచే రాజువయ్య మహారాజువయ్య శీర్షికన శోభన్ బాబు సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంస్కృతిక, పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, స్వచ్ సోచ్ ఫౌండర్ శ్రీనివాసరావు, ప్రముఖ గణేష్ రియల్ ఎస్టేట్ అధినేత కొండపల్లి గణేష్, జస్టిస్ ఆర్. మాధవ రావు, ప్రముఖ సినీ నటీనటులు జయసుధ, అలీ, శివ బాలాజీ, పవిత్ర, దర్శకుడు రేలంగి నరసింహారావు, టీవైజేఎస్ అధ్యక్షులు జితేందర్ రావు, మహమ్మద్ రఫీ, కుసుమ భోగరాజు, పద్మారావు, లాల్ బహదూర్ శాస్త్రి లు పాల్గొంటారని సిల్వెల్ అధినేత బండారు సుబ్బారావు, శృతిలయ ఫౌండేషన్ చైర్మన్ భీమ్ రెడ్డి లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed