ACB: ఒప్పందం నుంచి ఎందుకు తప్పుకున్నారు?.. ముగిసిన ఏస్ నెక్స్ట్ ఏసీబీ విచారణ

by Prasad Jukanti |
ACB: ఒప్పందం నుంచి ఎందుకు తప్పుకున్నారు?.. ముగిసిన ఏస్ నెక్స్ట్ ఏసీబీ విచారణ
X

దిశ,డైనమిక్ బ్యూరో: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో (Formula E car race case) ఏస్ నెక్స్ట్ సంస్థ (Ace Next Gen) ఏసీబీ విచారణ ముగిసింది. మూడు గంటల పాటు సంస్థ ప్రతినిధులను దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. ఫార్ములా రేస్ సీజన్ 9 తర్వాత జరిగిన పరిణాలు, మొదటి దశ కోసం రూ.30 కోట్లు చెల్లించడంపై ఆరా దీసినట్లు తెలిసింది. ఒప్పందం నుంచి ఎందుకు తప్పుకున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. కాగా ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ (ACB) విచారించింది. దీంతో ఏసీబీ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది.

Next Story