Vijay Sethupathi: నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘విడుదల-2’.. ఎందులో చూడొచ్చంటే?

by Hamsa |
Vijay Sethupathi: నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న  ‘విడుదల-2’.. ఎందులో చూడొచ్చంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi), మంచు వారియర్ కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం ‘విడుదల-2’(Viduthalai Part 2). వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘విడుదల’ సీక్వెల్‌గా వచ్చింది. కానీ అంతగా హిట్ అందుకోలేకపోయింది.అయితే డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా, ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) సొంతం చేసుకోగా.. జనవరి 19 నుంచి తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది. రిలీజ్ అయిన నెల రోజులకే విడుదల- 2 ఓటీటీలోకి రాబోతుండటంతో సినీ ప్రియులు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇప్పటికే ‘విడుదల పార్ట్-1’ అమెజాన్‌లోనే స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed