PM Modi: భూకంపాలు గుర్తించేలా హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేయాలి

by Shamantha N |
PM Modi: భూకంపాలు గుర్తించేలా హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేయాలి
X

దిశ, నేషనల్ బ్యూరో: భూకంపాల రాకను ముందే గుర్తించేలా హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయాలని ప్రధాని మోడీ(PM Modi) సైంటిస్టులను కోరారు. భారత వాతావరణశాఖ (IMD) 150 ఏళ్ల వేడుకను సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ‘మిషన్ మౌసం’(Mission Mausam)ను అధికారికంగా ప్రారంభించారు. వాతావరణ ప్రక్రియపై అవగాహనను పెంచేందుకు, నిర్వహణ, గాలి నాణ్యత డేటాను అందించడంపైనే మిషన్ మౌసం దృష్టిసారిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి గుర్తుగా ఐఎండీ విజన్-2047 పత్రాన్ని, స్మారక నాణేన్ని విడుదల చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో కలిగే నష్టాలను తగ్గించేందుకు సైంటిస్టులు కృషి చేయాలని అన్నారు. ప్రపంచ దేశాల్లో విపత్తు సంభవించిన సమయంలో వాటికి ఆపన్నహస్తం అందించడంలో భారత్‌ ముందుంటుందని అన్నారు

టెక్నాలజీ కారణంగా..

పర్యావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఊహించని వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని మోడీ అన్నారు. ఇలాంటి వాటిని వాటిని ముందుగానే గుర్తించి, కచ్చితమైన అంచనాలను విడుదల చేయడానికి భారత్‌ రెడీ అవుతోందన్నారు. అత్యాధునిక వాతావరణ నిఘా సాంకేతికతలు, వ్యవస్థలను అభివృద్ధి చేయడం, అధిక రిజల్యూషన్‌తో కూడిన వాతావరణ పరిశీలనల కోసమే ‘మిషన్ మౌసను ప్రారంభించామన్నారు. వాతావరణ శాఖలో టెక్నాలజీ పురోగతి కారణంగా దేశ విపత్తు నిర్వహణ సామర్థ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయని చెప్పుకొచ్చారు. ఇది దేశానికే కాకుండా ప్రపంచ దేశాలకూ ప్రయోజనకరంగా ఉందని అన్నారు. ఈ వేడుకల్లో ప్రపంచ వాతావరణ శాఖ సెక్రటరీ జనరల్ సెలెస్ట్ సౌలో, భూవిజ్ఞానశాస్త్ర శాఖ మంత్రి జితేంద్ర సింగ్, సెక్రటరీ ఎం.రవిచంద్రన్, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed