ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘రామ్‌నగర్ బన్నీ’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Hamsa |
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘రామ్‌నగర్ బన్నీ’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: బుల్లితెర మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్(Chandrahas) హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన నటించిన మొదటి చిత్రం ‘రామ్ నగర్ బన్నీ’(Ramnagar Bunny). ఈ సినిమాకు శ్రీనివాస్ మహత్(Srinivas Mahat) దర్శకత్వం వహించారు. అయితే దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్ (Prabhakar)పొడకండ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం అక్టోబర్ నెలలో విడుదలైంది. కానీ హిట్ సాధించలేకపోయింది. తాజాగా, ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా(Aha) సొంతం చేసుకోగా.. జనవరి 17 నుంచి స్ట్రీమింగ్(Streaming) అందుబాటులోకి రాబోతుందని ఓ పోస్టర్‌ను షేర్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed