Pawan Kalyan: లవ్ యూ డియర్.. టాలీవుడ్ హీరోయిన్ కు PK స్పెషల్ విషెష్

by Vennela |
Pawan Kalyan: లవ్ యూ డియర్.. టాలీవుడ్ హీరోయిన్ కు PK స్పెషల్ విషెష్
X

Pawan Kalyan: రీతూ వర్మ గురించి ఎలాంటి న్యూస్‌ అయినా ఇట్టే వైరల్‌ అయిపోతుంటుంది. ఆమె అందానికి ఉన్న ఫ్యాన్‌ ఫోలోయింగ్‌ అలాంటిది మరి. ఈ అచ్చమైన తెలంగాణ అమ్మాయికి సోషల్‌మీడియాలో కూడా క్రేజ్‌ ఎక్కువ. ముఖ్యంగా ఆమె చేసే పోస్టులకు విపరీతంగా కామెంట్స్ వస్తుంటారు. లైకులు మీద లైకులు కొడుతుంటారు. కొందరు షేర్ చేస్తారు. మరికొందరు ఆమె ఫొటోలను ఫోన్‌లో సేవ్ చేసుకుంటారు. చాలా క్యూట్‌గా కనిపించే రీతూ తెలుగు, తమిళ సినిమాల్లో పనిచేస్తోంది. పెళ్లిచూపులు చిత్రం ద్వారా ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి..అదే సినిమాలో నటనకు ఉత్తమ నటిగా నంది అవార్డు పొందింది. ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ కూడా అందుకున్నారు. తాజాగా ఆమె అందరికి హ్యాపీ పొంగల్‌ అని విషెష్‌ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. ఆ పోస్టుకు సంబంధించిన ఓ కామెంట్‌ గురించి నెట్టింత తెగ చర్చ జరుగుతోంది.

తెలుగుతనం ఉట్టిపడేలా చీరలో తలాతలా మెరిసిపోతున్న రీతూ వర్మను చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. మొత్తం 10 ఫొటోలు షేర్ చేస్తే పదీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆమె అందాన్ని వర్ణించడానికి మాటలు కూడా సరిపోవడం లేదు. ఇక ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు మతి అయితే ఇప్పటికే ఎటో పోయిందనే చెప్పవచ్చు. తమ ఇష్టాన్ని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు కొందరు. అందులో పవన్‌ కల్యాణ్‌ పేరు పెట్టుకున్న ఒక యూజర్ 'I Love You Dear' అని కామెంట్ పెట్టాడు. ఆ యూజర్‌ డిస్‌ప్లే నేమ్‌ 'addict_to_pk' అని ఉంది. కామెంట్ చివరిలో 😍😍 ఇలా కళ్లలో ప్రేమను ఒలకబోసుకోని తన అభిమానాన్ని చాటుకున్నాడు ఆ ఫ్యాన్. పేరులో పవన్‌ ఫ్యానిజం కనిపిస్తున్నా రీతూపై మాత్రం ఏనలేని ప్రేమ ఉన్నట్టు అర్థమవుతోంది.

ఇక రీతూ వర్మ మెగా ఫ్యామిలీలో ఒకరితో ప్రేమలో ఉందని.. త్వరలో ఆ ఇద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారన్న ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. మెగా ఫ్యామిలీ గ్రూప్‌ ఫొటోలో ఆమె కనిపించడమే దీనికి కారణం. అయితే ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఇదంతా ఫేక్‌ అని ఇరు వర్గాల నుంచి క్లారిటీ వచ్చింది. అయినా కూడా ఇటీవలి మళ్ళీ అవే రుమార్స్‌ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇక మెగా ఫ్యామిలీలో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ ఇప్పటికీ బ్యాచిలర్స్‌గానే ఉన్నారు. ఇందులో వైష్ణవ్ తేజ్ ఓ క్రేజీ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడని కొన్నిసార్లు వార్తలు వచ్చాయి. ఆ హీరోయిన్ రీతూ వర్మనేనని కొంతమంది పుకార్లు లేపారు. అయితే వీటిలో ఎంత నిజముందన్నది కాలమే తేల్చాలి.

Advertisement

Next Story

Most Viewed