Bank Jobs: ప్రముఖ బ్యాంక్‌లో ఆఫీసర్‌ పోస్టుల దరఖాస్తుకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి!

by Vennela |
Bank Jobs: ప్రముఖ బ్యాంక్‌లో ఆఫీసర్‌ పోస్టుల దరఖాస్తుకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి!
X

SBI: బ్యాంక్‌ జాబ్‌(Bank job) చాలా మంది కల. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగం కోసం రేయింబవళ్లు శ్రమించి చదివే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్‌ అస్పిరెంట్స్‌(Bank Aspirants) ఇంకాస్త ఎక్కువనే చెప్పాలి. చదివిన డిగ్రీతో సంబంధం లేకుండా చాలా మంది యువత బ్యాంక్‌లో జాబ్‌ కోసం కష్టపడుతుంటారు. అలాంటివారికి ఇదే అలెర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India)లో ప్రొబేషనరీ ఆఫీసర్-PO పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ కొనసాగుతోంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్(Recruitment drive) కింద మొత్తం 600 ఖాళీలను భర్తీ చేస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది.

SBI PO దరఖాస్తు ఫారమ్ నింపే ప్రక్రియ డిసెంబర్ 27 నుంచి ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి మూడు లేదా నాల్గవ వారంలో దరఖాస్తు చేసుకున్న వారికి అడ్మిట్ కార్డ్‌ అందుబాటులో ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష మార్చి 8, మార్చి 15, 2025న నిర్వహిస్తారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

SBI PO అప్లికేషన్ ఫీజు:

SBI PO రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే జనరల్/OBC/EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 750 అప్లికేషన్ ఫీజును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. SC/ST/PWD వర్గానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ:

1) ప్రాథమిక పరీక్ష (preliminary)

2) ప్రధాన పరీక్ష (Mains)

3) సైకోమెట్రిక్ టెస్ట్/గ్రూప్ ఎక్సర్సైజ్/ఇంటర్వ్యూ

4) చివరి దశలో సైకోమెట్రిక్ పరీక్ష, పర్సనాలిటీ ప్రొఫైలింగ్ కోసం ఇంటర్వ్యూలు ఉంటాయి.

తుది మెరిట్ జాబితా మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్-3 మొత్తం మార్కుల ఆధారంగా ఉంటుంది.

SBI PO అర్హత:

1) ఈ పోస్టులకు అర్హత పొందాలంటే, అభ్యర్థి తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

2) 21 మరియు 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

3) చివరి సంవత్సరం/సెమిస్టర్ విద్యార్థులు కూడా ఇంటర్వ్యూకు పిలిచినట్లయితే, వారు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఫ్రూఫ్‌ను చూపించాలి

SBI PO రిక్రూట్‌మెంట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

అభ్యర్థులు అధికారిక SBI వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేయండి:

1) అధికారిక SBI కెరీర్‌ల పేజీని సందర్శించండి. ( sbi.co.in )

2) 'ఆన్‌లైన్‌ సబ్మిట్‌' లింక్‌పై క్లిక్ చేయండి.

3) అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

4) అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

5) దరఖాస్తు రుసుము చెల్లించండి (వర్తిస్తే).

6) గడువుకు ముందు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.

Advertisement

Next Story

Most Viewed