ప్రజా మెనిఫెస్టో తయారు చేస్తున్నాం…

by Shyam |   ( Updated:2020-11-09 05:19:41.0  )
ప్రజా మెనిఫెస్టో తయారు చేస్తున్నాం…
X

దిశ,వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు కాంగ్రెస్ హయాంలో కల్పించినవే అని, గత ఆరేండ్లుగా మాటలకే టీఆర్ఎస్ పరిమితమైందని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఎన్నికల మెనిఫెస్టో కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి డిల్లీ నుంచి మాణిక్యం ఠాగూర్ పాల్గొని పలు సూచనలు చేశారు. గ్రేటర్ ఎన్నికల కోసం ప్రజా మేనిఫెస్టోను కాంగ్రెస్ రూపొందిస్తోందని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి విజ్ఞప్తులను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు.

Advertisement

Next Story