- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కారు’కు కలిసిరాని నవంబర్.. అదే సీన్ మళ్లీ రిపీట్..
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీకి నవంబర్ నెల కలిసి రావడం లేదు. గతేడాది నవంబర్‌లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి పాలైంది. ఆ ఎన్నికలు నువ్వానేనా అన్నట్లు సాగాయి. చివరికి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్ రావు 1118 ఓట్లతో విజయం సాధించారు. ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు సైతం నవంబర్‌లో జరగడం, తిరిగి బీజేపీనే గట్టి షాక్ ఇవ్వడం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించి మరోసారి టీఆర్ఎస్‌కు చెక్ పెట్టారు. దీంతో నవంబర్ అంటేనే టీఆర్ఎస్ నేతలు జంకే పరిస్థితి నెలకొంది.
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. స్థానిక సంస్థలతో పాటు ఏ ఎన్నికలు జరిగినా విజయం తమదేనని చెబుతున్న అధిష్టానం.. మరో అడుగు ముందుకు వేసి ఎవరిని నిలబెట్టినా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేసింది. అయితే, పార్టీని ప్రజలు ఆ స్థాయిలో విశ్వసించడం లేదని ఉప ఎన్నికల్లో మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టినా క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడంతోనే ప్రజలు ప్రభుత్వంపై, కేసీఆర్‌పై ఆగ్రహంగా ఉన్నట్లు చెప్పకనే చెప్పారు.