- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ గూటికి టీఆర్ఎస్ కార్పొరేటర్..?
దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి హాట్ టాఫిక్‌గా మారింది. ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ఉండగా ఈ వెలితి కనిపించేది కాదు. కానీ ఆయన బీజేపీలో చేరడంతో ఈ కుర్చీ కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. కూన తప్పుకున్నప్పటి నుంచి ఆ స్థానాన్ని కొంపల్లి కౌన్సిలర్ కందాడి జ్యోత్స్న శివారెడ్డి భర్తీ చేస్తుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ఆమె వైపే మొగ్గు చూపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమె సైతం అంతర్గతంగా పనులు ప్రారంభించి టికెట్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
టీఆర్ఎస్ కార్పొరేటర్ కన్ను..
ఇదిలా ఉండగా కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా తక్కువ మందే పోటీలో ఉన్నారు. ఇదే అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు పావులు కదుపుతున్నట్లు సమాచారం. గాజులరామారం సర్కిల్ పరిధిలోని ఓ కార్పొరేటర్ ఎమ్మెల్యే టికెట్ హామీ ఇస్తే కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. ఆయనతో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లతో పాటు ఆయన సామాజిక వర్గానికి చెందిన 4 వేల మంది కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంలో పార్టీ పెద్ద జానారెడ్డితో మంతనాలు కూడా జరిపారని, ఆయన రేవంత్ రెడ్డికి తీసుకెళ్లగా ఆలోచిద్దామని చెప్పినట్లు కార్పొరేటర్ అనుచరులు చర్చించుకుంటున్నారు.