- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారంతోనే టీఆర్ఎస్ కోడ్ ఉల్లంఘనలు..
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల సంఘానికి సోమవారం ఫిర్యాదు చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణీదేవి గెలుపు కోసం టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు బ్రాహ్మణ సమ్మేళనం, జర్నలిస్టులు, రేషన్ డీలర్లు, తెలంగాణ గజిటెడ్ అధికారులతో సమావేశాలు నిర్వహించారని, ఇవన్నీ కోడ్ ఉల్లంఘనలో భాగమేనని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఏ పనీ చేయకుండా ఇప్పుడు సమావేశాలు నిర్వహించి జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికసాయం చేయడం కేవలం ఓట్ల కోసమేనని తెలిపారు. ఇలాంటి ఘటనలను ఎన్నికల సంఘం ముందుగానే పసిగట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story