వరంగల్‌లో మొదటి జాబితా ప్రకటించిన టీఆర్ఎస్

by Shyam |   ( Updated:2021-04-21 02:51:08.0  )
Warangal Greater Municipal Elections
X

దిశ ప్రతినిధి, వరంగల్: వ‌రంగ‌ల్ కార్పోరేష‌న్ టికెట్ల కేటాయింపులో అధికార టీఆర్ ఎస్ పార్టీ కొంత స‌స్పెన్స్‌కు తెర‌దించింది. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు రేప‌టి వ‌ర‌కు ఉండ‌గా, బుధ‌వారం 18మంది టికెట్లు క‌న్ఫ‌ర్మ్ చేయ‌డంతో పాటు బీఫారంలు అంద‌జేయ‌డం గ‌మ‌నార్హం. ఈమేర‌కు బుధ‌వారం హ‌న్మ‌కొండ‌లోని మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్‌రావు ‌గృహంలో జ‌రిగిన కీల‌క స‌మావేశంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నిక‌ల స‌మ‌న్వ‌య క‌మిటీ స‌భ్యులంతా పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించి 18 డివిజ‌న్ల‌కు సంబంధించిన అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించింది బీఫారంలు అంద‌జేశారు. పరకాల నియోజకవర్గ పరిధిలోని ఉన్న‌ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4స్థానాలకు, ప‌శ్చిమ నియోజకవర్గం పరిధిలోని 5 స్థానాలకు, వర్ధన్నపేట పరిధిలోని 6 డివిజ‌న్ల‌కు అభ్యర్థులను పార్టీ ప్రకటించింది.

మొదటి జాబితాలో ఉన్నది వీళ్లే..

వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ అభ్యర్థిగా సురేశ్ జోషి, 23 డివిజన్ యెలుగం లీలావతి సత్యనారాయణ, 27 డివిజన్ జారతి రమేశ్, 38 డివిజన్ బైరబోయిన ఉమాదామోదర్, పరకాల నియోజకవర్గ పరిధిలో 15వ డివిజన్ అభ్యర్థిగా ఆకులపల్లి మనోహర్, 16 డివిజన్ సుంకరి మనీష శివకుమార్, 17 డివిజన్ గడ్డె బాబు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 5వ డివిజన్ అభ్యర్థిగా తాడిశెట్టి విద్యాసాగర్, 7వ డివిజన్ వేముల శ్రీనివాస్, 29వ డివిజన్ గుండు సుధారాణి, 51వ డివిజన్ బోయినపల్లి రంజిత్ రావు, 57వ డివిజన్ అభ్యర్థిగా నల్ల స్వరూపరాణిని టీఆర్ఎస్ ప్రకటించింది. అలాగే వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 2వ డివిజ‌న్ నుంచి బానోతు క‌ల్ప‌న సింగులాల్, 45వ డివిజ‌న్ నుంచి ఇండ్ల నాగేశ్వ‌ర్ రావు, 55వ డివిజ‌న్ నుంచి జ‌క్కుల ర‌జిత వెంక‌టేశ్వ‌ర్లు, 56వ డివిజ‌న్ నుంచి సిరంగి సునీల్ కుమార్, 64వ డివిజ‌న్ నుంచి ఆవాల రాధిక న‌రోత్తం రెడ్డి, 65వ డివిజ‌న్ నుంచి గుగులోత్ దివ్యారాణి రాజు నాయ‌క్‌కు టికెట్ల‌ను ఖ‌రారు చేశారు. ఈమేర‌కు మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, స‌త్య‌వ‌తిరాథోడ్‌, ఎమ్మెల్సీలు సార‌య్య‌, క‌డియం శ్రీహ‌రి, ఎమ్మెల్యేలు ధ‌ర్మారెడ్డి, అరూరి ర‌మేష్‌, న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌, విన‌య్‌భాస్క‌ర్‌, ఎంపీలు బండా ప్ర‌కాశ్‌, ద‌యాక‌ర్ చేతుల మీదుగా అభ్య‌ర్థులు బీఫారంలు అందుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed