లచ్చక్కో.. నీ భాషతో వాళ్లను కూడా చంపేస్తావా.. వదిలేయి ప్లీజ్

by Shyam |   ( Updated:2021-10-23 03:42:47.0  )
Manchu-Laksmi14
X

దిశ, సినిమా: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ.. ఏ పని చేసినా పెద్ద హంగామాలా ఉంటుంది. తనదైన మాటలు, కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలిచే మంచు లక్ష్మీ.. అటువైపు సోషల్ మీడియాలోనూ తెగ హల్చల్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేయడంతోపాటు మంచు ఫ్యామిలీ ముచ్చట్లను నెటిజన్ల ముందు పెడుతుంటుంది. ఈ క్రమంలోనే ‘నేను ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నాను. తమిళంలో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా, అద్భుతంగా ఉంది. సినిమాకు సంబంధించిన విషయాలు త్వరలో తెలియజేస్తాను’ అంటూ ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన నెటిజన్లు ‘లక్ష్మక్కో నీకు తెలుగే సరిగ్గా రాదు.. నీ తెలుగు భాష ప్రావీణ్యంతో ఇన్ని రోజులు మమల్ని చంపుకుతిన్నావు.. పాపం వాళ్లనయినా వదిలెయి అక్కా ప్లీజ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘మా (MAA) ఎన్నికల్లో మీ బ్రదర్ మంచు విష్ణు.. ప్రకాశ్ రాజ్‌ ను ఓడించేందుకు ఆయనను నాన్ లోకల్ అన్నాడు కదా.. మరి మీరెందుకు తమిళ్ మూవీలో యాక్టింగ్ చేస్తున్నారు’ అని ప్రశ్నించారు మరికొంత మంది.

Advertisement

Next Story

Most Viewed