భయం గుప్పిట్లో పోలవరం ముంపు ప్రాంతాలు

by srinivas |
flood
X

దిశ, వెబ్‌డెస్క్ : పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ జీవనం వెల్లదీస్తున్నారు. ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువన పోలవరం కాఫర్ డ్యాం గేటును అధికారులు మూసివేశారు. దీంతో ఆరురోజులుగా నీటి మట్టం పెరుగుతూ వస్తోంది. దీంతో తూర్పుగోదావరి జిల్లాలోని గిరిజన ప్రాంతాలు మొత్తం నీటితో నిండిపోయాయి.

దేవీపట్నం వద్ద క్రమంగా వరదనీరు పోటెత్తుతోంది. పోశమ్మ గండి వద్ద వరద నీరు ఇళ్లళ్లోకి చేరింది. మరో రెండు రోజులు ఏపీకి భారీ వర్షసూచన ఉండటంతో గిరిజన కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయి. ఆ ప్రాంతాలకు వెళ్లే రహదారులపై నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. ప్రస్తుతం అక్కడి ప్రజలు పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed