విచారణ నుంచి తప్పుకున్న జడ్జీ

by Anukaran |
విచారణ నుంచి తప్పుకున్న జడ్జీ
X

దిశ, ఏపీ బ్యూరో: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై విచారణను సుప్రీం కోర్టు బుధవారం మరోసారి వాయిదా వేసింది. హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. జస్టిస్ రోహింగ్టన్ నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టింది.

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై రాజధాని రైతు పరిరక్షణ సమితి పిటిషన్ దాఖలు చేసింది. రైతుల తరపున తన తండ్రి పాలిసామ్ నారిమన్ అడ్వకేట్ గా హాజరుకావడంతో జస్టిస్ రోహింగ్టన్ నారిమన్ విచారణ నుంచి తప్పుకున్నారు. “నాట్ బి ఫోర్ మీ” అని న్యాయమూర్తి రోహింగ్టన్ నారిమన్ వైదొలిగారు. దీంతో కేసు మరో బెంచ్ ముందు లిస్ట్ కానుంది. శుక్రవారం లేదా సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed