RTC BUS: అసలు ఎలా పెట్టావమ్మ.. బస్సు కిటికీలో ఇరుక్కున్న ప్రయాణికురాలి తల..

by Ramesh N |   ( Updated:18 May 2024 12:16 PM  )
RTC BUS: అసలు ఎలా పెట్టావమ్మ.. బస్సు కిటికీలో ఇరుక్కున్న ప్రయాణికురాలి తల..
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఆర్టీసీ బస్సులో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బస్సు కిటికీలో ఓ మహిళ తల ఇరుక్కుపోయి విలవిల్లాడింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ బెంగళూరులోని కేఎస్‌ఆర్టీసీ బస్సులో ఎక్కింది. బస్సు చివర వెళ్లి కూర్చుంది. అయితే ఆమెకు నోటిలో నీళ్లను తీసుకుని పుక్కిలించి ఉమ్మి వేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆమె తల భాగంను చిన్నగా ఉన్న కిటికీలో నుంచి బయటకు తీసింది. ఆ తర్వాత తిరిగి తలను లోపలికి తేవడానికి ప్రయత్నించగా తల భాగం లోపలికి రాలేదు.

దీంతో మహిళ ఒక్కసారిగా టెన్షన్ పడిపోయింది.వెంటనే కాపాడాలని సాయం కోరగా బస్సులో ఉన్న డ్రైవర్, కండెక్టర్‌తో సహా అందరూ కూడా అక్కడకు వచ్చి తలను లోపలికి జరిపేందుకు ప్రయత్నించారు. అక్కడికి వచ్చిన డ్రైవర్లు, కండక్టర్‌లు దాదాపుగా గంటసేపు శ్రమించగా.. చివరికి ఎలాగోలా ఆమె తలను లోపలి వైపుకు వెళ్లేలాతీశారు. దాదాపు గంట సేపు కూడా మహిళ ఎంతో నరకం అనుభవించినట్లు తెలుస్తోంది. అయితే ఎమర్జెన్సీ డోర్‌కు కిటీకీలు చిన్నగా ఉంటాయని.. అసలు తల ఎలా పెట్టావమ్మ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed