- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Viral Video: యూపీలో షాకింగ్ ఘటన.. జ్యూస్‌లో మూత్రం కలిపి అమ్ముతున్న నిర్వాహకులు
దిశ, డైనమిక్ బ్యూరో: ఫ్రూట్ జ్యూస్ లో మూత్రాన్ని కలిపి అమ్ముతున్న షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇందులో స్థానికులు జ్యూస్ షాప్ ఓనర్ తో పాటు సహాయకుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఘటన ప్రకారం ఘజియాబాద్ పట్టణంలో అమీర్ ఖాన్ అనే వ్యక్తి ఖుషీ జ్యూస్ కార్నర్ పేరుతో దుకాణం నడుపుతున్నాడు. ఇందులో జ్యూస్ తాగేందుకు వచ్చే కొందరు కస్టమర్లకు మూత్రాన్ని కలిపి అమ్ముతున్నట్లు అనుమానించిన స్థానికులు షాప్ ఓనర్ అమీర్ ఖాన్ తో పాటు అతని సహాయకుడ్ని చితకబాదారు. దుకాణం నుంచి బయటకి తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, స్థానికుల చెర నుంచి జ్యూస్ షాప్ నిర్వాహకులను కాపాడారు. అనంతరం స్థానికుల ఫిర్యాదుతో దుకాణంలో సోదాలు నిర్వహించగా.. లోపల మానవ మూత్రం ఉన్న డబ్బా కనిపించింది. దీనిపై అమీర్ ఖాన్ ను ప్రశ్నించగా.. అతడి నుంచి సరైన సమాధానం లభించలేదు. దీంతో పోలీసులు ఓనర్ తో పాటు మైనర్ అయిన సహాయకుడ్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నామని, మూత్రం డబ్బాను పరీశీలన కోసం పంపించామని ఏసీపీ భాస్కర్ వర్మ తెలిపారు.