Viral Video: ఏఐతో అద్భుతం.. తాజ్‌మహల్‌ ని మళ్లీ నిర్మించారు

by Ramesh Goud |
Viral Video: ఏఐతో అద్భుతం.. తాజ్‌మహల్‌ ని మళ్లీ నిర్మించారు
X

దిశ, వెబ్ డెస్క్: ఏఐ పరిజ్ఞానం(AI Technology)తో తాజ్‌మహల్‌ నిర్మాణం(Construction Of The Taj Mahal) పునః సృష్టి(Recreates) చేసిన వీడియో నెట్టంట చక్కర్లు కొడుతోంది. టెక్నాలజీ పెరిగాక మనషుల్లో ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇందులో కృత్రిమ మేధ(Artificial Intelligence) అందుబాటులోకి వచ్చాక లేనివి ఉన్నట్లుగా.. జరగనివి జరిగినట్లుగా సృష్టించి సామన్యులను ఆశ్యర్యపరుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఏఐ టెక్నాలజీతో వివిధ దేశాల నాయకులు కలిసి డాన్స్(Country's Leaders Dance) చేసిన వీడియో సృష్టించగా.. ఇప్పుడు ఏకంగా 400 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ నిర్మాణానికి సంబంధించి ఓ వీడియోను రూపొందించారు.

ఈ వీడియోను చూస్తుంటే తాజ్ మహల్ నిర్మాణం నిజంగా ఇలాగే జరిగిందా? అనేలా ఉంది. ఇందులో పురాతన కాలంలో మాదిరిగా ఎటువంటి యంత్ర సహాయం లేకుండా ఏనుగులను(Elephants), ఓడ(Ships)లను ఉపయోగించి పెద్ద బండరాళ్లను తరలించడం వంటివి చూపించారు. ఈ వీడయో చూస్తుంటే.. తాజ్‌మహల్‌ నిర్మాణం వెనక కార్మికులు పడ్డ కష్టాన్ని కళ్లారా చూసినట్లు ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral) గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. నిజంగా చాలా అద్భుతం(Really Amazing)గా ఉందని, ఇందులో కార్మికుల చేతులు నరికినది కూడా చూపిస్తే వారికి జరిగిన అన్యాయం కూడా తెలిసేది అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story