Viral: వైరల్ అవుతున్న స్టూడెంట్ ఆన్సర్ షీట్!.. చూస్తే వావ్ అనాల్సిందే

by Kavitha |
Viral: వైరల్ అవుతున్న స్టూడెంట్ ఆన్సర్ షీట్!.. చూస్తే వావ్ అనాల్సిందే
X

దిశ, ఫీ,చర్స్: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక విషయం వైరల్ అవుతునే ఉంటాయి. అందులో ఇంట్రెస్టింగ్ వీడియోలు, ఫన్నీ పోస్ట్‌లు మాత్రం జనాల్నిఎక్కువగా ఆకట్టుకుంటాయి. అలాగే పరీక్షల్లో విద్యార్థులు రాసిన ఫన్నీ ఆన్సర్లు కూడా ఇటీవల కాలంలో నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

@Rajputbhumi అనే టీచర్ ఈ ఆన్సర్ షీట్‌ను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. అందులో భాగంగా తమ అభిమాన టీచర్ గురించి రాయాలని ఆరో తరగతి ప్రశ్నా పత్రంలో అడిగిన దానికి ఓ విద్యార్థి చాలా చక్కగా సమాధానం రాశాడు. “మాకు టీచర్లందరూ ఇష్టమే. కానీ చాలా మంచి విషయాలు నేర్పించే, చాలా ప్రేమగా ఉండే భూమిక మేడమ్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. భూమిక మేడమ్‌లా టీచర్లందరూ ఉంటే పిల్లలు శ్రద్ధగా చదువుకుంటారు. ఐ లవ్ యు భూమి మేడమ్”అంటూ ఆ విద్యార్థి తన టీచర్‌ను పొగుడుతూ రాశాడు.

ఆ జవాబు పత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన భూమిక టీచర్.. “నా మనస్సు ఎప్పుడు బాగోలేక పోయినా నేను దీనిని చదువుతాను” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు.. మంచి మార్కులు పొందడానికి ఇదే బెస్ట్ వే అని.. ఆ కుర్రాడు చాలా స్మార్ట్ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.


Advertisement

Next Story