Viral News: ఆస్తి కోసం కన్నకొడుకు తండ్రిని ఏం చేశాడంటే.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Shiva |   ( Updated:2024-04-28 13:00:51.0  )
Viral News: ఆస్తి కోసం కన్నకొడుకు తండ్రిని ఏం చేశాడంటే.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: డబ్బు.. ప్రపంచాన్ని శాసిస్తోన్న ఓ శక్తి. ఆ శక్తి ముందు మానవ సంబంధాలు కూడా దిగదుడుపు అవుతున్నాయి. తల్లీదండ్రులనే తేడా లేదు డబ్బు కోసం ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడతున్న రోజులివి. తాజాగా, ఆస్తి కోసం కన్నతండ్రిపై ఓ కొడుకు విచక్షణారహితంగా దాడి చేసి చంపిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీ అమృత సాగో ఇండస్ట్రీస్ యజమాని ఏ.కులందైవేల (63), కొడుకు సంతోష్‌కు మధ్య కోన్నేళ్ల నుంచి ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి తన పేరున రాయడం లేదంటూ కక్ష పెట్టుకున్న సంతోష్ తండ్రిని కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 16న ఇంట్లో సోఫాలో కూర్చున్న తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అయితే, రెండు నెలల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కులందైవేల ఏప్రిల్ 18న గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్న పోలీసులకు కీలక ఆధారం లభించింది. సంతోష్ తన తండ్రిపై దాడి చేసిన వీడియో ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఆ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ మేరకు నిందితుడు సంతోష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఏప్రిల్ 25న అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

Advertisement

Next Story