Viral Pics: నామినేషన్ ర్యాలీపై ట్రోల్స్.. ఏకంగా శవయాత్ర అంటూ షాకింగ్ కామెంట్స్

by Indraja |
Viral Pics: నామినేషన్ ర్యాలీపై ట్రోల్స్.. ఏకంగా శవయాత్ర అంటూ షాకింగ్ కామెంట్స్
X

దిశ వెబ్ డెస్క్: నిన్నటితో నామినేషన్ల పర్వం ముగిసిపోయింది. కానీ ఓ ప్రముఖ పార్టీ అభ్యర్థి నామినేషన్ యాత్రపై మాత్రం ట్రోల్స్ ఆగటం లేదు. నామినేషన్ వేసేందుకు యాత్రగా వెళ్లడం కూడా తప్పేనా..? దానికే ట్రోల్ చేస్తారా? అంటే చేస్తారు అని ట్రోలర్స్ నిరూపిస్తున్నారు. ఇక ఏదైనా పరిమితిలో ఉంటే పర్లేదు, కానీ పరిమితి దాటితేనే పరువు పోతుంది అనడానికి ఈ అభ్యర్థి ఉదాహరణగా నిలిచారు.

వివారాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవింద రెడ్డి నిన్న నామినేషన్ వేశారు. అయితే ఆయన నామినేషన్ వేసేందుకు ర్యాలీగా వెళ్లారు. ఇందులో వింతేముంది, ప్రస్తుతం చాలామంది నేతలు ర్యాలీగానే వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ అభ్యర్థిని మాత్రమే ట్రోల్ చెయ్యడానికి కారణం ఆయన ర్యాలీ కోసం ఉపయోగించిన వాహనం.

ఎందుకంటే ఆ వాహనానికి డెకరేషన్ చేసే వ్యక్తి కాస్త ఓవర్‌గా చేశారు. ఆ వాహనంపై ఎమ్మెల్యే అభ్యర్థి ఫోటోను పెట్టి వాహనానికి డెకరేషన్ చేశారు. అయితే ఆ డెకరేషన్ నామినేషన్ వేయడానికి వెళ్తున్న ఎమ్మెల్యే అభ్యర్ధి వాహనాన్నని తలపించలేదు. చూసిన వెంటనే ఆ వాహనం అంతిమ యాత్ర వాహనంలా కనిపించింది. ఇక నామినేషన్ వేసేందుకు అభ్యర్థి ఉపయోగించిన వాహనానికి సంబంధించిన ఫోటో చూసిన కొంత మంది.. అయ్యో అంటూ అపోహ పడ్డారు కానీ అటువంటి దేమీ లేదు.

ఇక ఈ ఫోటో కాస్త ట్రోలర్స్ చేతికి చిక్కడంతో రెచ్చిపోతున్నారు. ఆ ఫోటోపై మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనితో ఆ ఫోటోలు కాస్త వైరల్‌గా మారాయి. ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఇది అదేదో యాత్ర అనుకొని పొరపాటు పడకండి.. ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ యాత్ర మాత్రమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story