Trending: ఝార్ఖండ్‌లో అద్భుతం.. మహాభారతంలో ప్రస్తావించిన ‘తక్షక నాగు’ ప్రత్యక్షం (వీడియో వైరల్)

by Shiva |   ( Updated:2024-12-04 12:26:36.0  )
Trending: ఝార్ఖండ్‌లో అద్భుతం.. మహాభారతంలో ప్రస్తావించిన ‘తక్షక నాగు’ ప్రత్యక్షం (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: ఝార్ఖండ్ రాష్ట్రం (Jharkhand State)లో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. తక్షకుడనే పాము ఆనాడు భారతదేశాన్ని పరిపాలించిన పరీక్షిత్తు (Parikshitthu)ను కాటేసినట్లు మహాభారతం (Maha Bharath)లో చదువుకున్నాం. అయితే, అదే పేరుతో పిలిచే ఓ అరుదైన పాము ఝార్ఖండ్‌ రాష్ట్రం (Jharkhand State)లోని రాంచీ పట్టణం (Ranchi City)లో దర్శనమిచ్చింది. ఓ ప్రభుత్వ కార్యాలయం (Government Office)లోకి ఎక్కడి నుంచో వచ్చి చొరబడిన ఆ పామును చూసి అక్కడున్న అధికారులు భయంతో వణికిపోయారు. మామూలు పాములకు భిన్నంగా ఉన్న ఆ సర్పాన్ని చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, అంతరించిపోతున్న పాముల జాబితాలో ఉన్న తక్షక నాగు ఎక్కువగా చెట్లపైనే నివసిస్తూ ఉంటుంది. ఒక చెట్టు మీది నుంచి మరో చెట్టు మీదకు గాల్లోనే 100 అడుగుల మేర జంప్ చేయగలిగే సామర్థ్యం తక్షక నాగు సొంతం. అది వందల ఏళ్లు బతుకుతుందని ఉత్తర భారతదేశంలోని పలు గ్రామాల ప్రజలు నమ్ముతారు.

Advertisement

Next Story