- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Trending: ప్రభుత్వాసుపత్రిలో ప్రసవించిన న్యాయమూర్తి.. నెట్టింట్లో ఫొటో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: అమ్మో.. సర్కార్ దవాఖానా..! అంటూ సామాన్యులు సైతం ఆ ఆసుపత్రుల్లో ప్రసవించేందుకు వెనుకాడుతున్న రోజుల్లో ఓ జడ్జి తీసుకున్న నిర్ణయం ప్రభుత్వాసుపత్రుల పట్ల నమ్మకాన్ని నెలబెట్టింది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన స్వప్న నల్లగొండ జిల్లా మునిసిఫ్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తోంది. అయితే, ఆమెకు మిర్యాలగూడ మండలం నిడమనూరుకు చెందిన దాసరి కార్తీక్‌తో వివాహం జరిగింది. ఈ క్రమంలోనే గర్భవతి అయిన స్వప్న ప్రసవం కోసం కొత్తగూడెంలోని పుట్టింటికి వెళ్లింది.
చిన్నప్పటి నుంచి ఉన్నత విలువలతో పెద్ద చదువులు చదివి జడ్జిగా కొనసాగుతున్న ఆమె ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే స్థోమత ఉన్నా అక్కడి వెళ్లలేదు. ప్రభుత్వాసుపత్రులపై సామాన్య ప్రజలకు ఉన్న అపోహాలు తొలగించి నమ్మకం కలిగేలా తాను అక్కడే ప్రసవించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆమె ఆదివారం రాత్రి కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ అయి అక్కడే ప్రసవించారు. అనంతరం జడ్జి స్వప్న మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అర్థికంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వాస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.