TRENDING: జంతువుల శబ్దాలను అద్భుతంగా ఇమిటేట్ చేసిన స్కూల్ స్టూడెంట్.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో

by Kavitha |
TRENDING: జంతువుల శబ్దాలను అద్భుతంగా ఇమిటేట్ చేసిన స్కూల్ స్టూడెంట్.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో
X

దిశ, ఫీచర్స్: టాలెంట్ ఎవరి సొత్తు కాదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. సాధారణంగా పిల్లలు కార్టూన్ వీడియోలు, గేమ్స్ వీడియోలు, యానిమల్స్‌కు సంబంధించిన వీడియోలు ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. అయితే కొంత మంది పిల్లలు అచ్చుగుద్దినట్టు సేమ్ టు సేమ్ జంతువుల శబ్దాలను చేస్తుండటం మనం గమనిస్తూనే ఉంటాము. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లోని పాలి జిల్లాలోని రణవాస్ అనే గ్రామంలో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్‌లో ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఒక చిన్న పిల్లవాడు తన ప్రతిభను ప్రదర్శించాడు. అతను జంతువుల శబ్దాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను మొదట ఒక నొప్పితో బాధపడుతున్న కుక్క పిల్ల లాగా సౌండ్ చేశాడు. దీంతో అక్కడున్న వాళ్ళు దాన్ని అంతగా పట్టించుకోకపోవడమే కాకుండా అతన్ని చూసి కొంతమంది నవ్వారు కూడా.

కానీ, తర్వాత అతను ఒక పక్షి శబ్దం చేశాడు. దాంతో అక్కడున్న వాళ్ళు చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత, అతను కోయిల శబ్దం చేశాడు. ఆ సౌండ్ ఎలా ఉందంటే.. నిజంగా కోయిలే అరుస్తుందా అనిపించేంతగా ఆ సౌండ్‌ను ఇమిటెడ్ చేశాడు. చివరగా, మేక సౌండ్‌ను ఇమిటేట్ చేశాడు. దాంతో అప్పుడు అందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. అయితే స్టార్టింగ్ ఆ పిల్లవాడు ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఆ ఏం చేస్తాడులే అని అనుకున్న ప్రేక్షకులు.. తర్వాత అతని టాలెంట్‌ను చూసి వారి ముఖాల్లో ఆశ్చర్యంతో పాటు ఎవరిని చులకనగా చూడకూడదు అనే భావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా ఈ వీడియోను 3.5 మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు. దీంతో వీడియో కాస్త వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి మీరు ఆ బాలుడు ప్రతిభను చూసేయండి.

(video link credits to newarisir_res instagram id)

Advertisement

Next Story