Trending: మూడోసారి కుప్పకూలిన అగువాని-సుల్తాన్ గంజ్ బ్రిడ్జి.. నెట్టింట్లో వీడియో వైరల్

by Shiva |
Trending: మూడోసారి కుప్పకూలిన అగువాని-సుల్తాన్ గంజ్ బ్రిడ్జి.. నెట్టింట్లో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లోని గంగా నదిపై నాలుగు లేన్లతో నిర్మాణంలో ఉన్న అగువానీ-సుల్తాన్‌గంజ్ తీగల వంతెన భాగం శనివారం ఉదయం మూడోసారి కుప్పకూలింది. ఈ మేరకు ఘటన శనివారం ఉదయం 8 గంటలకు జరిగినట్లుగా జిల్లా మేజిస్ట్రేట్, అమిత్ కుమార్ పాండే ధృవీకరించారు. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన వెల్లడించారు. మొదటి నుంచి బ్రిడ్జి నిర్మాణం, నాణ్యతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, వంతెన కూలుతున్న సమయంలో అక్కడున్న కొందరు తమ ఫోన్లలో వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు కాస్త వైరల్‌గా అయ్యాయి. జరిగిన ప్రమాదంపై సీఎం నితీశ్ కుమార్ విచారణకు ఆదేశించారు. కాగా, రాష్ట్రంలోని ఖగారియా, భాగల్‌పూర్ జిల్లాలను కలుపుతూ.. అక్కడి సర్కార్ గంగా నదిపై నాలుగు లేన్లతో బ్రిడ్జి నిర్మాణం తలపెట్టింది. అగువాని సుల్తాన్ గంజ్ పేరుతో నిర్మిస్తున్న ఈ వంతెన కోసం ప్రభుత్వం రూ.1,710 కోట్లు వెచ్చించింది. గతేడాది ఏప్రిల్ నెలలో వంతెనలో కొంతమేర కూలిపోయింది. బలమైన గాలుల వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు చెప్పడం కొసమెరుపు.

వీడియో కోసం పక్కనే ఉన్న లింక్ క్లిక్ చేయండి: https://x.com/PuraLocal/status/1824698249090892131

Advertisement

Next Story