- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP News: ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక పిలుపు

దిశ,వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం పాల కేంద్రం వద్ద ఫినిక్స్ ఫౌండేషన్ మరియు శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛంద సంస్థలు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయం అన్నారు.
నెలరోజుల కృషితో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ‘ఇప్పుడే ఎన్నికలు లేవు, కాబట్టి రాజకీయాలకు తావు లేకుండా అందరం కలిసికట్టుగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుదాం’ అని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తెనాలిలో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ₹30 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ₹5 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ వేసవి కాలంలో నియోజకవర్గంలోని డొంక రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో డొంక రోడ్ల నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ₹10 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. రైతులకు మేలు చేసేందుకు కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా అధికార యంత్రాంగం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.