రాములోరి లగ్గం చూతము రారండి

by Naveena |
రాములోరి లగ్గం చూతము రారండి
X

దిశ ,భద్రాచలం: భద్రాచలం సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. అయితే శ్రీ సీతారాముల కళ్యాణంకు రావాలని కోరుతూ.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, కొండా సురేఖతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రామాలయ అధికారులు శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల గోడ ప్రతిని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రామాలయం వేద పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కృష్ణవేణి, ఈ ఓ రమాదేవి, ఏ ఈ ఓ శ్రావణ్ కుమార్ ప్రధాన అర్చకులు విజయ రాఘవన్, స్థానాచార్యులు స్థల సాయి, అర్చకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed