- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MS Dhoni : ఐపీఎల్ ఫ్యూచర్‌పై ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ పరిస్థితిలో ఉన్నా సీఎస్కే కోసం వచ్చి ఆడతా

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ 2020లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. చెన్నయ్ సూపర్ కింగ్స్ తరపున ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. అయితే, ఈ సీజన్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఐపీఎల్ ఫ్యూచర్‌పై ధోనీ స్పందించాడు. ముంబైతో మ్యాచ్‌కు ముందు జియో హాట్‌స్టార్‌తో ధోనీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే తరపున చాలా ఏళ్లు ఆడగలనని చెప్పాడు. ‘ఇది నా ఫ్రాంచైజీ. నేను వీల్‌చైర్‌లో ఉన్నా వాళ్లు నన్ను తీసుకొస్తారు.’అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 43 ఏళ్ల ధోనీ ఈ సారి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఆటగాడిని కూడా అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గానే పరిగణిస్తారు. దీంతో సీఎస్కే అతన్ని రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకుంది.