SRH vs RR : చెలరేగిన సన్ రైజర్స్... రాజస్థాన్ టార్గెట్ 287

by M.Rajitha |   ( Updated:2025-03-23 12:24:56.0  )
SRH vs RR : చెలరేగిన సన్ రైజర్స్... రాజస్థాన్ టార్గెట్ 287
X

దిశ, వెబ్ డెస్క్ : సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య ఐపీఎల్ 2025( IPL 2025) మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం(Uppal Stadium)లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసి, రికార్డ్ క్రియేట్ చేసింది. సన్ రైజర్స్ లో ఇషాన్ కిషన్(Ishan Kishan) సెంచరీతో చెలరేగగా.. హెడ్ 67, క్లాసెన్ 34, నితీశ్ కుమార్ 30 పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ లో దేశ్ పాండే 3, తీక్షణ 2, తుషార్ 1 వికెట్స్ తీశారు. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 287 కాగా.. మరి కొద్దిసేపట్లో బ్యాటింగ్ కు దిగనుంది.

Next Story

Most Viewed