- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trending: సరికొత్త టెక్నిక్‌తో చేపలు పట్టిన యువకుడు.. నెట్లింట్లో వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: ‘టెక్నిక్’ అది తెలిసినోళ్లు ఎంత కష్టమైన పనినైనా.. సునాయసంగా చేసేస్తారు. సమయానికి కొంచెం బ్రెయిన్ ఊపయోగిస్తే చాలు చిటికెలో పని అవ్వగట్టేస్తారు. సాధారణంగా మనం చేపలు పట్టాలంటే.. ఏం చేస్తాం.. గాలమో లేక వలనో వేసి పట్టేస్తాం. కానీ, అందుకు భిన్నంగా ఆఫ్రికాలో ఓ యువకుడు సరికొత్త టెక్నిక్‌తో చేపలు పట్టేస్తూ అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తుస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను తాజాగా ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ఓ యువకుడు ఒళ్లంతా బురద పూసుకుని చెరువు గట్టుపై పడుకుంటాడు. అనంతరం సన్నని పొడవైన పైపును నోట్లు పెట్టుకుని చెరువులో ఊదుతుంటే వచ్చే బుడగలకు చేపలు అక్కడి రాగానే ఆ యువకుడు వాటిని అమాంతం చేతితో పట్టి గట్టు బయటకు విసిరేస్తుంటాడు. అయితే, వీడియో చూసిన నెటిజన్లు ఇలా కూడా చేపలు పట్టొచ్చా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరేమో ఈ టెక్నిక్ తెలియక అనవసరంగా గాలాలు, వలలు వాడుతున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు.