Trending: బైక్ బర్త్‌ డేను సెలబ్రేట్ చేస్తున్న యువకుడు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

by Kavitha |
Trending: బైక్ బర్త్‌ డేను సెలబ్రేట్ చేస్తున్న యువకుడు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మనం మనుషుల బర్త్‌డే సెలెబ్రెట్ చేస్తుండటం చూస్తాంటాము. ఇక యానిమల్స్ లవర్స్ అయితే వారి పెంపుడు జంతువుల పుట్టిన రోజులు జరుపుతుండటం చూస్తుంటాం. మరి బైక్‌కు పుట్టిన రోజు జరపడం ఇప్పుడైనా చూసారా? అసలు విన్నారా.. ఏంటి బైక్‌కు బర్తడే ఆ అని ఆశ్చర్యపోతున్నారా.. నిజమేనండి బాబు తన టూ వీలర్‌కు పుట్టిన రోజు సెలెబ్రెట్ చేశాడు ఓ యువకుడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ వ్యక్తి తన బైక్ బర్త్‌డేను సెలెబ్రేట్ చేశాడు. అంతే కాదోండోయ్ సేమ్ మనుషులు కట్ చేసినట్టే ఆ బైక్‌ టైర్‌కు కూడా చాక్‌ను కట్టి దానితో కేక్ కట్ చేయించారు. అయితే ఈ తతంగాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అయింది. దీనిని చూసిన నెటిజన్లు బైక్ అంటే ఎంత ఇష్టమో ఈ వ్యక్తికి అని కొంతమంది అంటుంటే, మరికొంత మంది పాపులారిటీ కోసం ఇలా చేస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed