Jaggareddy: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి మద్దతుగా జగ్గారెడ్డి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
Jaggareddy: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి మద్దతుగా జగ్గారెడ్డి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy)కి తన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. జీవన్‌ రెడ్డి(Jeevan Reddy) ఆవేదన చూసి బాధనిపించిందని అన్నారు. ఈ వయసులో ఆయనకు ఇలాంటి పరిస్థితి రావడం బాగోలేదు. జీవన్‌రెడ్డి(Jeevan Reddy) ఒంటరి అనుకోవద్దు.. మీ వెంట నేనుంటా.. నిత్యం జనం మధ్య ఉండే జీవన్‌ రెడ్డిని జగిత్యాలలో.. నన్ను సంగారెడ్డిలో ప్రజలు ఎందుకు ఓడగొట్టారో అర్థం కావడం లేదు’ అని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, తన అనుచరుడు గంగారెడ్డి(Gangareddy) హత్యపై జీవన్ రెడ్డి సీరియస్‌గా ఉన్నారు. ఇక నుంచి తాను కాంగ్రెస్‌లో కొనసాగలేననీ బహిరంగంగానేకామెంట్ చేశారు. దీంతో ఆయన్ను పార్టీ పెద్దలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story