- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చైనాలో డ్రైవర్ లెస్ బైక్స్.. ఆ ఒక్కటి సెట్ చేస్తే చాలు!

దిశ, వెబ్ డెస్క్: డ్రైవర్ లెస్ కార్లు విదేశాల్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కారు ఎక్కితే చాలు డ్రైవర్ సహాయం లేకుండా మీ గమ్య స్థానానికి చేరుస్తుంది. అయితే కార్లు మాత్రమే కాదండీ ఇప్పుడు డ్రైవర్ లెస్ బైకులు కూడా వచ్చేశాయ్. బండిపై కూర్చుని లొకేషన్ సెట్ చేశారంటే చాలు మీకు టెన్షన్ లేకుండా గమ్య స్థానానికి చేరవచ్చు. అంతే కాకుండా ఇవి పెట్రోల్ కూడా అవసరం లేకుండా చార్జింగ్‌తో నడిచే ఎలక్ట్రానిక్ బైకులు కాబట్టి పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు. ప్రస్తుతం ఈ బైకులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో రద్దీగా ఉన్న చైనా రోడ్లపై సైతం ట్రాఫిక్ లోనే ఈ బైకులు రై.. రై మంటూ దూసుకుపోతున్నాయి.
వాటికి ఏవైనా వాహనాలు అడ్డువచ్చినా వాటంతట అవే పక్కకు తప్పుకుంటున్నాయి. ఇవి పూర్తిగా సెన్సార్ సిస్టంతో పనిచేస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే నిజానికి బైక్ ఎక్కిన తరవాత మనిషికి డ్రైవ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు కానీ డ్రైవింగ్ రానివారికి మాత్రం ఈ బైకులు చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ప్రస్తుతం ర్యాపిడో, ఊబర్ ద్వారా చాలా మంది బైకులను బుక్ చేసుకుని వెళుతున్నారు. అదే డ్రైవర్ లెబ్ బైకులు అందుబాటులోకి వస్తే అసలు డ్రైవర్ లేకుండానే రాపిడో, ఊబర్ కస్టమర్లను తీసుకెళ్లవచ్చు. నిజానికి ఈ బైకుల వల్ల ఉపయోగాలు ఉన్నా ప్రస్తుతం డెలివరీ ప్లాట్ ఫామ్‌లలో పనిచేస్తున్న ఎంతో మంది పొట్టకొట్టే ప్రమాదం కూడా ఉంది.