- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
దిశ, దేవరకొండ : దేవరకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో కార్తీక మాసం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక డీలక్స్ బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ తల్లాడ రమేష్ బాబు శుక్రవారం తెలిపారు. పంచారామ క్షేత్రాలైన అమరావతి( అమరలింగేశ్వర స్వామి), భీమవరం(సోమేశ్వర స్వామి), పాలకొల్లు( క్షీర లింగేశ్వర స్వామి), ద్రాక్షారామం( భీమేశ్వర స్వామి), సామర్లకోట (భీమలింగేశ్వర స్వామి) క్షేత్రాలకు నవంబర్ నెల 3,10,17,24 తేదీల్లో(ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు) దేవరకొండ బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. ఒకే రోజు పంచారామ క్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా నవంబర్ నెల 15 వ తేది కార్తీక పౌర్ణమి సందర్భంగా.. 14వ తేది రాత్రి 8గంటలకు కూడా ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 13న తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. పంచారామాలకు డీలక్స్ బస్సు చార్జీలు: పెద్దలకు రూ.2000, పిల్లలకు రూ.1200 ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు,బుకింగ్ కోసం సెల్: 7382833031,7382833070 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. డిపో పరిధిలోని భక్తులు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.