- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Urvashi Rautela: ఏజ్‌లో తనకంటే పెద్దవారితో నటించడంపై బోల్డ్ బ్యూటీ ఊర్వశి రియాక్షన్ ఇదే!
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) ఐటమ్ సాంగ్స్ చేసి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ అమ్మడు వాల్తేరు వీరయ్య(Waltair Veerayya ), స్కంద, బ్రో వంటి మూవీస్‌లో స్పెషల్ సాంగ్‌లో ఆడి పాడింది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ తన ఫొటోలు షేర్ చేసి యూత్‌ను ఫిదా చేస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఊర్వశి, బాలయ్య(Balakrishna) ‘NBK-109’ సినిమా కోసం వర్క్ చేస్తుంది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశి తనకంటే వయసులో పెద్దవారితో నటించడంలో తప్పులేదని స్ట్రాంగ్‌గా చెప్పింది. ‘‘నాకు 19 ఏళ్లు ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. అయితే సన్నీడియోల్(Sunny Deol)తో స్క్రీన్ షేర్ చేసుకున్నా. అప్పుడు వయసు పరంగా మా మధ్య 38 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అది బాలీవుడ్‌లో ఒక రికార్డు. నాకు తెలిసినంత వరకు అంత ఏజ్ గ్యాప్‌తో ఎవరూ నటించలేదు. సన్నీడియోల్(Sunny Deol) పిల్లలకంటే కూడా నేను చిన్నదాన్ని.
అయితే డైరెక్టర్ స్క్రిప్ట్ ఆ విధంగానే రెడీ చేశారు కాబట్టి యాక్ట్ చేయడంలో తప్పు లేదని అనిపించింది. సినిమాల్లో నాకంటే పెద్దవారితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అది వృత్తి కాబట్టి నేను ఫీల్ కాను. అందులో తప్పేముంది. నేను నాకంటే పెద్ద వ్యక్తితో డేట్‌లో ఉంటే బాధపడాలి. కానీ నటిస్తే కాదు’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఊర్వశి(Urvashi Rautela) రియాక్షన్ చూసిన నెటిజన్లు గ్రేట్ అంటున్నారు.