Fake IPhones : నకిలీ ఐఫోన్లు అమ్ముతున్న నలుగురి అరెస్ట్

by M.Rajitha |
Fake IPhones : నకిలీ ఐఫోన్లు అమ్ముతున్న నలుగురి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : చైనా ఫోన్లకు స్టిక్కర్లు వేసి ఐఫోన్లు(IPhones)గా అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్(Hyderabad) లో అబిడ్స్ జగదీష్ మార్కెట్లో (Abids Jagadish Market) నకిలీ ఐఫోన్లు అమ్ముతున్న నలుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జగదీష్ మార్కెట్లో చైనా ఫోన్లకు ఐఫోన్ స్టిక్కర్లు వేసి అమ్ముతున్నారన్న సమాచారంతో శుక్రవారం పోలీసులు మొబైల్ షాప్స్ మీద రైడ్ చేశారు. ఇందులో రూ.3 కోట్ల విలువైన నకిలీ ఐఫోన్ పరికరాలను చేసుకున్న పోలీసులు.. స్టిక్కర్లు మార్చి ఐఫోన్లుగా అమ్ముతున్న దుకాణాలను సీజ్ చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు. గత కొన్ని నెలలుగా నిందితులు మోసానికి పాల్పడి అమాయకుల నుండి కోట్ల రూపాయలు దోచుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story