Pulicintala project: పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

by Naveena |   ( Updated:2024-10-25 13:19:22.0  )
Pulicintala project: పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
X

దిశ, చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టు(Pulicintala project)కు వరద ప్రవాహం కొనసాగుతోంది.ఎగువ ప్రాంతం నాగార్జున సాగర్ (Nagarjuna Sagar)నుంచి 22గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో.. పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుంది.దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 42.16 టీఎంసీ(TMC)లు గా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులకు గాను ఇప్పటి వరకు నీటిమట్టం 173.12అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 1,72,525క్యూసెక్కులు(Cusacks) కాగా రెండు ప్రాజెక్టు రేడియల్ గేట్లు(Project Radial Gates) 3 మీటర్లు, రెండు రేడియల్ గేట్లు 3.5 మీటర్లు, మూడు రేడియల్ గేట్లు రెండు మీటర్లు మేర ఎత్తి 1,36,160 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మరోవైపు ప్రాజెక్టు ఎడమ వైపున ఉన్న విద్యుత్ కేంద్రం(Power station) నుంచి విద్యుత్ ఉత్పాదన (Power generation)కొనసాగుతుంది. పులిచింతల విద్యుత్ కేంద్రం (Pulichintala Power Station)పూర్తి సామర్థ్యం 120 యూనిట్లు కాగా.. నాలుగు యూనిట్ల నుంచి 105 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని ఎస్ఈ దేశ్యా నాయక్ (Pulichintala Project SE Deshya Naik) తెలిపారు. విద్యుత్ ఉత్పాదన కోసం 16,000 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story