Heatwave : దంచికొట్టిన ఎండలు.. జగిత్యాలలో ఆల్ టైమ్ రికార్డ్ ఉష్ణోగ్రతలు

by M.Rajitha |
Heatwave : దంచికొట్టిన ఎండలు.. జగిత్యాలలో ఆల్ టైమ్ రికార్డ్ ఉష్ణోగ్రతలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) వ్యాప్తంగా నేడు సూర్యుడు తన ప్రతాపం(Heatwave) చూపించాడు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు(Temparatures) భారీగా నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో నేడు అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో 44.3 డిగ్రీల, నిజామాబాద్ జిల్లా మెండోరలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో మరో మూడు రోజులు ఎండల తీవ్రత విపరీతంగా పెరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పగటి వేళల్లో బయట తిరగవద్దని.. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నేడు కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షం పడింది. ముఖ్యంగా తూర్పు ప్రాంతాల్లో ఈ వర్షం నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు.



Next Story

Most Viewed