water walking : వాటర్ వాకింగ్ గురించి విన్నారా..? రోజూ అలా చేస్తే మస్తు బెనిఫిట్స్!

by Javid Pasha |   ( Updated:2024-10-25 15:16:41.0  )
water walking : వాటర్ వాకింగ్ గురించి విన్నారా..? రోజూ అలా చేస్తే మస్తు బెనిఫిట్స్!
X

దిశ, ఫీచర్స్ : వాటర్ వాకింగ్ గురించి మీరెప్పుడైనా విన్నారా?.. చాలామందికి తెలియకపోవచ్చు కానీ దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ‘నీటిలో నడక’పై చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అధిక బరువు తగ్గడంలో, శక్తి సామర్థ్యాలను పెంచడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. బీచ్ లేదా స్వి్మ్మింగ్ పూల్స్‌లో నీటిలో నడవడమే వాటర్ వాకింగ్ (water walking) అంటారు. సాధారణ వ్యాయామాలకంటే కూడా దీనిని చేయడానికి ఎక్కవ శ్రమ అవసరం అవుతుంది. ప్రయోజనాలు కూడా అలాగే ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆరోగ్యంగా ఉండాలని సాధారణ వ్యాయామాలతోపాటు జిమ్‌లలో వర్కవుట్స్, యోగా, మెడిటేషన్ వంటివి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అయితే వీటి మాదిరిగానే వాటర్ వాక్ చేయడం కూడా చక్కటి ఫలితాన్నిస్తుందని ఫిట్‌నెస్ నిపుణులు అంటున్నారు. ఇది శరీరంలో కొవ్వుశాతాన్ని కరిగించడం ద్వారా ఊబకాయం సమస్యను దూరం చేస్తుంది. నీటిలో నడిచేందుకు ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. బేసిటీ, కీళ్ల నొప్పులు, డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయని నిపుణులు చెప్తున్నారు.

ఎలా చేయాలి?

మిగతా వ్యాయామాలతో పోలిస్తే తక్కువ సమయంలోనే అధిక బరువు తగ్గేందుకు వాటర్ వాకింగ్ ఉపయోగపడుతుంది. సరిగ్గా చేయకపోతే ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా నీటిలో నడుస్తున్నప్పుడు ఒకే విధమైన వేగాన్ని కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల కండరాలు బలపడతాయి. బీచ్ లేదా స్విమ్మింగ్ పూల్‌ (Swimming పూల్)లో రోజుకు అరగంట వాటర్ వాక్ చేసేవారిలో చక్కటి ఫిట్‌నెస్ సాధ్యం అవుతుంది.

బరువు తగ్గుతారు

అధిక బరువు (ఓవెర్వెయిట్) సమస్యతో ఇబ్బంది పడేవారు వాటర్ వాక్ చేయడం వల్ల కొద్దిరోజుల్లోనే తగ్గే అవకాశం ఉంటుందని ఫిట్‌నెస్ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది అధిక కేలరీలను బర్న్ చేస్తుంది. నీటి సాంద్రత గాలికంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేలపై నడకకంటే నీటిలో నడవడంవల్ల గంటకు 460 కేలరీలను బర్న్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు. దీంతో తక్కువ సమయంలో ఈజీగా బరువు తగ్గుతారు.

గుండె బలానికి..

వాటర్‌లో వాకింగ్ చేయడం మొత్తం శరీర కదలికల ద్వారా కండరాల బలానికి మేలు చేస్తుంది. దీంతో గుండె కండరాలు కూడా బలంగా తయారవుతాయని ఫిట్‌నెస్ నిపుణులు చెప్తున్నారు. కీళ్లపై అధిక ఒత్తిడి (Excessive stress on the జాయింట్స్) పడకుండానే హార్ట్‌రేట్ పెంచడంలో, నియంత్రించడంలో వాటర్ వాకింగ్ కీ రోల్ పోషిస్తుంది. కొలెస్ట్రాల్ బర్నింగ్‌లో, అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడటం ద్వారా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వారంలో రెండు మూడుసార్లు వాటర్ వాకింగ్ చేసినా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story