CP Anand: హైదరాబాద్ లోనే ప్రభాకర్ రావు ప్రచారంపై సీవీ ఆనంద్ క్లారిటీ.. 'ముత్యాలమ్మ' నిందితుడి మెదడు నిండా మతోన్మాదమే: సీపీ

by Prasad Jukanti |   ( Updated:2024-10-25 13:16:05.0  )
CP Anand: హైదరాబాద్ లోనే ప్రభాకర్ రావు ప్రచారంపై సీవీ ఆనంద్ క్లారిటీ.. ముత్యాలమ్మ నిందితుడి మెదడు నిండా మతోన్మాదమే: సీపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Taping Case) కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) హైదరాబాద్ నగరంలోనే ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ సిటీ సీపీ సీవీ ఆనంద్ (Cp Cv Anand) స్పందించారు. ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని అందువల్ల అతడు ఏ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయినా తమకు సమాచారం వస్తుందన్నారు. రాష్ట్రంలో త్వరలోనే పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారనే దీంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నమోదు అయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు హైదరాబాద్ (Hyderabad) వచ్చారనే ప్రచారం ఊపందుకోగా దీన్ని సీపీ ఖండించారు. దీంతో మంత్రులు చెబుతున్నట్లుగా పొలిటికల్ బాంబు (Political Bomb Comments) ఏ అంశంలో పేలబోతున్నాయనేది మరింత ఉత్కంఠ రేపుతున్నది.

నిందితుడి మెదడు నిండా మతోన్మాదం:

ముత్యాలమ్మ (Muthyalamma Temple) ఆలయంపై జరిగిన దాడి ఘటనపై సీపీ కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఘటనలో నిందితుడి మెదడు మొత్తం మతోన్మాదంతో నిండిపోయిందని చెప్పారు. నిందితుడు ఓ కంప్యూటర్ ఇంజినీర్ అని అతడు పని చేసే ప్రతి ఆఫీస్ లోనూ అందరితో వాదిస్తూ గొడవలు పడే వాడని చెప్పారు. గతంలోనూ ముంబయి (Mumbai) లో ఇదే తరహాలో వ్యవహరిస్తే అక్కడ రెండు కేసులు నమోదు అయ్యాయన్నారు. అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాము పోలీసులమని చెప్పగానే అతడి సిస్టర్ మాట్లాడుతూ మరో విగ్రహాన్ని కూల్చేశాడా అని అడిగారని అతడిలో ఏదైనా మార్పు వస్తుందనే ఉద్దేశంతో రూ.30 వేలు ఖర్చు చేసి కుటుంబ సభ్యులు అతడిని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు పంపిస్తే ఇక్కడికి వచ్చి ఈ న్యూసెన్స్ చేశాడని చెప్పారు. అతడిని కలవడానికి ఇప్పటి వరకు ఒక్కరు కూడా రాలేదన్నారు. ముత్యాలమ్మ ఆలయం ఘటన కేసులో ముంబయి ఏటీఎస్ (ATC), ఎన్ఐఏ (ANI) తో కలిసి పని చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story