Train Hijack : పాకిస్థాన్ లో రైలు హైజాక్

by M.Rajitha |
Train Hijack : పాకిస్థాన్ లో రైలు హైజాక్
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్(Pakistan) కు భారీ షాకిచ్చారు తీవ్రవాదులు. ఏకంగా ఓ ఎక్స్ ప్రెస్ రైలునే హైజాక్(Train Hijack) చేశారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) కి చెందిన తీవ్రవాదులు. తొలుత జాఫర్ ఎక్స్ ప్రెస్(Jaffar Express) వస్తున్న దారిలో పట్టాలను పేల్చివేశారు. దానిని గమయించిన లోకో పైలట్ బ్రేకులు వేసి రైలును ఆపివేయగా.. తీవ్రవాదులు చుట్టుముట్టి రైలును తమ అధీనంలోకి తీసుకున్నారు. అందులోని 350 పైగా ప్రయాణికులను, 100 మందికి పైగా సైనికులను అదుపులోకి తీసుకున్నారు. అందులోని ఆరుగురు సైనికులను హాతమార్చినట్టు తెలుస్తోంది. అనంతరం ఆ ప్రయాణికుల్లో ఆడవాళ్ళు, చిన్నపిల్లలను విడిచిపెట్టి మగవారిని, సైనికులను మాత్రమే బంధీలుగా పట్టుకున్నారు. బలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించేందుకు బీఎల్ఏ పాక్ ప్రభుత్వాన్ని చర్చలకు ఆహ్వానించింది. చర్చలకు రాకుండా ఏవైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే రైలులో ఉన్న అందరినీ హతమారుస్తామని హెచ్చరించింది. కాగా పాక్ ఆర్మీ దళాలు ప్రస్తుతం రైలును చుట్టుముట్టాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం తాము ఎదురు చూస్తున్నట్టు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed