Viral Video: ఇది అమెరికా కాదు.. మన హైదరాబాదే!

by Disha Web Desk 14 |
Viral Video: ఇది అమెరికా కాదు.. మన హైదరాబాదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని హైదరాబాద్ నగరం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. గ్రేటర్ పరిధిలో ఆకాశాన్ని తాకుతున్నట్లు తలపించే నిర్మాణాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు రియల్ ఎస్టేట్ గురించి అందరికీ తెలిసిందే. అయితే, రోజురోజుకు మన భాగ్యనగరం మరింత డెవలప్ అవుతోందని తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది.

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న బిల్డింగులపై తీసిన డ్రోన్ షాట్‌ను పృథ్వీ చౌదరి అనే నెటిజన్ తాజాగా ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూస్తే అచ్చం అమెరికాను తలపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం వల్లే నగరం అభివృద్ధి చెందిందని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాల వల్లే అభివృద్ధి చెందిందని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed