Independence Day:రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘జన గణ మన’ ఇదే..ఫొటో వైరల్!

by Jakkula Mamatha |   ( Updated:2024-08-15 16:10:59.0  )
Independence Day:రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘జన గణ మన’ ఇదే..ఫొటో వైరల్!
X

దిశ,వెబ్‌డెస్క్:నేడు దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా స్వతంత్ర ఉద్యమం నాటి స్ఫూర్తి భావనలు నెలకొన్నాయి. ఎందరో త్యాగధనుల ఫలితమే ఈ స్వాతంత్య్రం అని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, ప్రఖ్యాత నోబెల్ ప్రైజ్ నిర్వాహకులు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. "జన గణ మన" అనేది భారత జాతీయ గీతం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయగీతం ‘జనగణమన’ రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్‌ను ‘నోబెల్’ కమిటీ గుర్తుచేసుకుంది. ఆయన స్వయంగా ఆంగ్లంలో రాసిన ‘జన గణ మన’ పత్రాన్ని ట్విట్టర్‌లో పంచుకుంది. మొదట 1911లో బెంగాలీలో ‘భారోతో భాగ్యో బిధాత’గా కంపోజ్ చేయగా 1950లో భారత రాజ్యాంగం దీనిని జాతీయ గీతంగా ఆమోదించింది. 1913లో ఆయనకు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది.





Advertisement

Next Story

Most Viewed