- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వధువుకు జుట్టు తక్కువగా ఉందని పెళ్లి క్యాన్సిల్.. వరుడికి ఆ విధంగా షాకిచ్చిన పెళ్లికూతురు
దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న చిన్న కారణాలతో పెళ్లిని రద్దు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లో ఓ వరుడు, వధువుకు జుట్టు తక్కువగా ఉందని పెళ్లిని రద్దు చేసుకున్న సంఘటన తీవ్ర చర్చనీయాంశమవుతుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని ఆయోధ్యలోని జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బికాపూర్ ప్రాంతంలో ఓ జంట పెళ్లికి రెడీ అయ్యారు. ముహూర్తానికి కొన్ని గంటల సమయం ఉందనగా.. వరుడు కాబోయే భార్యకు జుట్టు తక్కువగా ఉందని పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు. వరుడి మాటలకు పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వరుడికి నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. ఎంత చెప్పినా కానీ వరుడు పెళ్లికి నిరాకరించాడు. ఈ క్రమంలో వధువు ఆమె కుటుంబ సభ్యులు వరుడు అదనకు కట్నం డిమాండ్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వరుడుతో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.